Wednesday, November 21, 2012

"కల్కి" అవతారం కంటే ముందు "కల్తీ" సైతాన్ వచ్చేసింది.

                                                                    

కల్కి అయితే యుగాంతాని కి రావచ్చేమో కాని అంత కంటే ముందు "సైతాన్"(కలి) రూపాలు వచ్చేశాయి.వీటి ద్వారానే ప్రస్తుతం నడుస్తుంది "కలి యుగాంత" దశ అని చెప్పవచ్చు. మనం చూస్తున్న వివిద కలి రూపాలలో "కల్తీ" ఒకటి.
 నేను ఈవిషయం గురించి మీకు ఎక్కువగా చెప్పక్కర్లేదు అనుకుంటా? మనం పీల్చే గాలినుంచి, తినే తిండి వరకు కల్తీ లేనిది ఎక్కడో చెప్పండి.డబ్బులు కుమ్మరించిన "కల్తీ"లేని సరుకు దొరకడం కష్టం అవుతున్న ఈ రోజుల్లో అసలు మనం దేన్ని చూసి మనకున్న పాలనా వ్యవస్త బాగుందని కితాబివాలో అర్థం కావడం లేదు.

 మార్కేట్లో ఒక సహజమైన పండును చూడలేని, స్వచ్చమైన పాలు అందించలేని, మనది ఒక పాలనేనా? రోజూ  కల్తీ పదార్థాలు తిని తిని మన బుద్ది కూడ కల్తీ అయిపోయిందనుకుంటా! అందుకే "కల్తీ నాయకులకు" జై కొడుతున్నాం.వారు  తప్ప దిక్కు లేదని దేబిరిస్తున్నాం.

 మనకు ఈ కలి రూపమయిన "కల్తీ’ ని సంహరించి(నిరోదించి) కల్తీ చేయ్యా లనుకున్న వారి గుండేలో ఎవరు రైళ్లు పరిగెత్తిస్తారో వారే "కల్కి"అవతార పురుషుడు.ఆశ్రమాలు పెట్టి వ్యాపారాలు చేసేవారు కాదు గాక కాదు

       మేదావుల,చదువుకున్న వారి,  ఆలోచనలు సామాన్యుల కంటే మెరుగా ఉంటాయి అనే ఉద్దేస్యంతో  ఈ బ్లాగులో ఒక" సర్వె పోల్ "పెట్టడం జరిగింది.ఇది మాములుదే అనుకోకుండా తప్పకుండా మీ అభిప్రాయం ఓటు ద్వార  తెలుపుతారని ఆశిస్తూ...

1 comment:

  1. మీరు పెట్తిన సర్వే పోల్ లో జయ ప్రకాశ్ నారాయణ్ గారికి ఎక్కువ వోట్లు పోల్ అవ్వడం ఆశ్చర్యంగా ఉంది! మీ బ్లాగుని జగన్ అభిమానులు చూడరా?

    ReplyDelete